తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి,
నా నమస్కారములు!
ఈ వెబ్సైటును జిల్లా వారిగా గ్రామాల్లో ఉన్న రైతుల కోసం, నగరాల్లో, పట్టణాల్లో ఉన్న ప్రజలకోసం మరియు మన అందరి కోసం తయారు చేయబడినది.
ముఖ్యముగా, మనకున్న “నిత్యావసర సమస్యలైనా”, “విద్యా సమస్యలైనా”, “ఆరోగ్య సమస్యలైనా”, “రైతుల సమస్యలైనా”, “ఉద్యోగ సమస్యలైనా”, “దీర్ఘకాలిక సమస్యలైనా” మరియు ఏ ఇతర సామాజిక సమస్యలైనా వాటన్నింటిని కూడా అందరి దృష్టికి తీసుకురావడమే – నా మొదటి ముఖ్య లక్ష్యము.
అందుకే నేను కొంత శ్రమపడి ఈ వెబ్సైటు చేశాను, వారి పరిస్థితులేమిటో క్షున్నంగా తెలుసుకోవడానికి మరియు వాటిని మన అందరి దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను, తద్వారా ఈ సమస్యలకు కొంతమేరకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని నా ఆశయం.
ఈ వెబ్సైటును నా స్వంతగా కొంత ఖర్చుతో తయారు చేసినాను, ఒక వేళ ఇదిగనుక మన అందరికి ఉపయోగపడి నా శక్తికి మించిన భారమైతే అప్పుడు నేను మీ సహాయం కోసం ఒక “విజ్ఞప్తి” రూపంలో ముందుకు వస్తాను.
మనలో కొంత “సామాజిక అవగాహన” (Social Awareness), మన పరిసరాల ప్రాముఖ్యత (Environmental Importance) మరియు మన “జీవన నాణ్యత” (Quality of Life) అంటే ఏమిటో మన అందరికి తెలవాలనేదే – నా రెండవ లక్ష్యము.
- మనము శుభ్రమైన గాలిని పీలుస్తున్నామా?
- మనము శుభ్రమైన నీటిని త్రాగుచున్నామా?
- మనము పౌష్ఠికరమైన ఆహారాన్ని తీసుకుంటున్నామా?
- మనము మంచి ఆరోగ్యము తో జీవిస్తున్నామా?
- మనము శుభ్రమైన మరియు కాలుష్య రహితమైన పరిసరాల్లో జీవిస్తున్నామా?
- మనము వాహనాలు నడుపుటలో భద్రత నియమాలను పాటిస్తున్నామా?
- మనము మన పిల్లలకు సరిఅయినటువంటి విద్యా వసతులను కల్పించగలుగుతున్నామా?
- మనము మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామా?
- మనము మన సమాజంలో ఇతరులతో గౌరవ ప్రదంగా కలసి మెలసి ఉంటున్నామా?
- మనము మాట్లాడే మాటకు కట్టుబడి ఉంటున్నామా?
- మనము కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నాము అని తెలిసినప్పుడు, సహాయం పొందడం ఎలా అని ఆలోచిస్తున్నామా?
- మనము = “మన సమాజంలో ప్రతి ఒక్కరం”
వాటిలో ఏ ఒక్కటికైనా మనకు మనమే ఇచ్చుకునే సమాధానము గనుక “లేదు” అని తెలిస్తే, మనము చదివిన చదువులకు ( Politics, Business, Law, Medicine, Engineering, Psychology, … ), తీసుకున్న పట్టాలకు ( Bachelors, Masters, P.G., Ph.D., … ) “అర్థాలే లేవు” – అని గట్టిగా అర్థం చేసుకోని, తిరిగి పాఠాలు నేర్చుకునే సమయమొచ్చిందని తెలుసుకోవాలి.
ఇదంతా చదివితే “నవ్వొస్తుందా?” – నవ్వాలి, ఆరోగ్యానికి మంచిది కూడా, కాని “ఆలోచన” కూడా చేయాలి! 🙂
మన జీవన నాణ్యతను మెరుగు పరచడానికి మనమెంతో కృషి చేయాల్సి ఉంటుంది, పెద్ద చదువులు చదువడమో, పుస్తకాలు చదువడమో లేదా ఇతరులనుంచి కొన్ని మంచి విషయాలను తెలుసుకోవడమో ఇంకా మరెన్నో విధాలుగా కష్టపడవలసి వస్తుంది.
“ మన జీవన నాణ్యతను మెరుగు పరుచాలంటే మన సమస్యలను మనమంతా కలిసికట్టుగా ఆచరణాత్మకంగా అధిగమించాలి, అదే ఏకైక మార్గం.” – నిరంజన్ మొహమ్మద్.
“ The only way to improve the quality of our lives is to tackle our problems practically, all of us together.” – Niranjan Mohammed.
ఈ “సమస్యలు” అనే వెబ్సైటును మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి అంకితం చేస్తూ, ఇక ముందు నేను మీ అందరితో ఈ వెబ్సైటు ద్వారా మాట్లాడుతూ ఉంటాను, సెలవు మరి!
NIRANJAN MOHAMMED / నిరంజన్ మొహమ్మద్.
samasyalu.com
FOUNDER
SAMASYALU.COM – IS AN ONLINE WEB PORTAL, TOTALLY COMMITTED AND DEDICATED TO SERVE THE PEOPLE OF BOTH THE TELUGU STATES WITH ITS ALTRUISTIC VISION TO IMPROVE THE QUALITY OF OUR LIVES BY BRINGING OUR SOCIAL PROBLEMS TO EVERYBODY’S ATTENTION – WITHOUT ANY DISCRIMINATION.